Sunday, March 4, 2007

కలలు + కల్పనలు = కాగితాలు
వేకువ జాముల్లో
నన్ను నేను మరిచినప్పుడు
గాఢ సుషుప్తిలో
అలసిన కనుపాపల కింద
కలలొచ్చి నన్ను కావలించుకుంటాయి

సుదూర సాగర సైకత తీరాలకు
వెన్నల కురిసే పచ్చిక బయళ్ళకు
పైరు పచ్చల పల్లె సీమలకు
పిల్లగాలుల మల్లె తోటలకు
సునాయాసంగా నను మోసుకెళతాయి

1 comment:

రాధిక said...

అద్భుతం గా వుంది కవిత.మీలోని కధకుడు,భావకుడు పోటిపడుతున్నారు.మీరు కవితలో అన్నట్టు కొన్ని ఆనంద తీరాలకు కలల్లో సునాయాసం గా వెళ్ళవచ్చు.